Tuesday, 31 December 2013
Saturday, 30 November 2013
వీరభద్రుని సేవ చిత్రాలు
నారశూల ధారణ
నారశూల ధారణ
స్నేహితుని వివాహ సంధర్భంలో జరిగిన వీరభద్రుడి పళ్ళెం కార్యక్రమములో నేను పాల్గొన్న చిత్రాలు.
Thursday, 7 November 2013
హరిహరాసనం స్వామి విశ్వమోహనం
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
హరిహరాసనం స్వామి విశ్వమోహనం
హరితదీశ్వరం స్వామి ఆరాధ్యాపాదుకం
హరివిమర్ధనం స్వామి నిత్యనర్తనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
శరణకీర్తనం స్వామి శక్తిమానసం
భరణతోలుకం స్వామి నర్తనాలసం
ఆరుణభాసురం స్వామి భూతనాయకం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
ప్రణవసత్యకం స్వామి ప్రాణనాయకం
ప్రణతకల్పకం స్వామి శుభ్రభాజితం
ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
తుర్గవాహనం స్వామి సుందరానానం
వరగదాయుధం స్వామి దేవవర్ణితం
గురుకృపాకరం స్వామి కీర్తనప్రియం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
త్రిభువనార్చితం స్వమై దేవతాత్మకం
త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం
త్రిదశ పూజితం స్వామి చింతతప్రదం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
భవభయాపహం స్వామి భావుకావహం
భువనమోహనం స్వామి భూతిభూషణం
ధవళావాహనం స్వామి దివ్యవారణం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
కలమృదుస్మీతం స్వామి సుందరాననం
కలభకోమలం స్వామి గాత్రమోహనం
కలభకేసరి స్వామి వాజివాహనం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
శ్రితజనప్రియం స్వామి చింతత ప్రదం
శ్రుతివిభూషణం స్వామి సాధుజీవనం
శ్రుతిమనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే || శరణ ||
అయ్యప్ప దీక్షాధారులు ధర్మ సందేహం ..
అయ్యప్ప దీక్షాధారులు తలకు నూనె , స్నానానికి సబ్బు, షాంపూలు ఉపయోగించ వచ్చా తెలియజేయగలరు.....
Tuesday, 29 October 2013
అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు వేరే వారి పీఠం లో మధ్య లో చేరి పూజించ వచ్చా ?? నా ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరు.
అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు వేరే వారి పీఠం లో మధ్య లో చేరి పూజించ వచ్చా ??
నా ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరు.
నా ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరు.
Wednesday, 23 October 2013
ధర్మానికి హాని కలిగితే !!!???
ధర్మానికి హాని కలిగితే ఏమవుతుంది ???
ధర్మ , రాజ , వహ్ని , తస్కరుల్ నలుగురు
భ్రాతలర్ధమునకు బ్రాలి వారలందు ।
నగ్రజాతునవమాన మొనరింప
గినుక వొడము మువ్వురనుజులకును ॥
ధర్మం , అగ్ని , రాజు , దొంగ ఈ నలుగురూ అన్నదమ్ములంటుంది ధర్మఖండం. పెద్దవాడైన 'ధర్ముడి' కి అన్యాయం జరిగితే అయన తమ్ములైన అగ్ని , రాజు , దొంగ ముగ్గురూ కోపగిస్తారట.
చత్వారో ధనదాయాదా ధర్మాన్ని నృపతస్కరాః ।
జ్యేష్ఠ ( భ్రాతా ) వమానేన త్రయః కుర్యంతి సోదరాః ॥
ధర్ముడు , అగ్ని , రాజు , తస్కరుడు ( దొంగ ), నలుగురన్నదమ్ముల్లో పెద్దవాడికన్యాయం జరిగితే
అగ్ని కొంపలు, సంపదలు కాల్చేస్తాడు. రాజు పన్నులు విధించి వేధిస్తాడు. దొంగ దొంగిలిస్తాడు అని అర్ధం.

Monday, 21 October 2013
18 మహాపురాణాల్లో స్కాందపురాణం ఒకటి. ఈ పురాణాన్ని సాక్షాత్తూ ఆ కైలాసవాసుడైన మహేశ్వరుడు స్కందునికి ఉపదేశించాడు.
స్కాందపురాణం:
మహాపురాణాల్లో స్కాందపురాణం ఒకటి. ఈ పురాణాన్ని సాక్షాత్తూ ఆ కైలాసవాసుడైన మహేశ్వరుడు స్కందునికి ఉపదేశించాడు. ఇందులో ఏడు ఖండాలున్నాయి. రెండవదైన వైష్ణవఖండంలో శ్రీ వేంకటాచల మాహాత్మ్యం నలభై అధ్యాయాల్లో వర్ణితమైంది.
భగవంతుని శ్వేతవరాహావతార వర్ణనం, వరాహస్వామి మహామహి మత్వం, వైభవ విశేషాలు దీనిలో ప్రతిపాదితమయ్యాయి. మొదటి పది అధ్యాయాలు ధరణి వరాహ సంవాదరూపంలో ఉన్నాయి. ఇందులో వరాహమంత్రారాధన, దాని ఫలితం పేర్కొన్నారు. ఇంకా శ్రీ వేంకటాచల క్షేత్ర వర్ణన, చతుర్ముఖుడైన బ్రహ్మ ప్రారంభించిన బ్రహ్మోత్సవ విశేషాలు, వేంకటేశ్వర వైభవం, శ్రీ వేంకటేశ్వరుని యందు అష్టవిధ భక్తి విధానాలు, భగవంతుడు భూత సృష్టి చెయ్యడం, భరధ్వాజ మహర్షి వర్ణించిన వేంకటాచల మాహాత్మ్య విషయాలు, అంజనాదేవి పుత్రునికోసం తపస్సు చెయ్యడం, వ్యాస మహర్షి చెప్పిన ఆకాశ గంగా స్నాన కాలనిర్ణయం, వేంకటాచలంలో చెయ్యదగ్గ దాన విశేషాలు ఇత్యాదివి వర్ణితమయ్యాయి.
శ్రీ పద్మావతీ శ్రీనివాస కల్యాణ వర్ణన సందర్భంలో భూమినుండి పద్మావతి లభించడం, నారద మహర్షి పద్మావతికి సాముద్రికం చెప్పడం, శ్రీనివాసుడు వేటకోసం పుష్పోద్యానానికి రావడం, పద్మావతిని చూసి మోహాన్ని పొందడం, ఆకాశరాజు నగరానికి వకుళమాలిక రావడం, ఆమెకు పద్మావతీ సఖులు పద్మావతీ వృత్తాంతం చెప్పడం వర్ణితమయ్యాయి.
అలాగే, పద్మావతి భగవంతుని, భగవద్భక్తుల లక్షణాల్ని చెప్పడం, వకుళమాలికి మాట మేరకు ధరణీదేవి ఆకాశరాజులు పద్మావతీ శ్రీనివా సుల కల్యాణాన్ని నిశ్చయించడం, ఈ విషయాన్ని శుకమహర్షి ద్వారా శ్రీనివాసునికి తెలియచెప్పడం, మహాలక్ష్మి తదితరులు శ్రీనివాసునికి వివాహాలంకారం చెయ్యడం, శ్రీనివాసుడు బ్రహ్మాదులతో నారాయణ వనా నికి రావడం, పద్మావతీ శ్రీనివాసుల పరిణయం, శ్రీనివాసుడు ఆకాశరాజు నకు భక్తప్రాప్తిరూపమైన వరం అనుగ్రహించడం మొదలై నవి వర్ణితమయ్యాయి.
Sunday, 20 October 2013
బ్లాగ్మిత్రులారా బారిష్టరు పార్వతీశం పుస్తకం P.D.F. కానీ ...పుస్తకం కానీ కావాలి .
బ్లాగ్మిత్రులారా బారిష్టరు పార్వతీశం పుస్తకం P.D.F. కానీ ...పుస్తకం కానీ కావాలి . pdf ఐతే మెయిల్ చెయ్యండి . పుస్తకం ఐతే పోస్ట్ చెయగలరు. పైకం చెల్లించి అందుకోగలను . ఈ - మెయిల్ . sateesh.b.f.a@gmail.com .
చిరునామా : టి. వి. వి. సత్యనారాయణ చారీ
తక్కెళ్ళపాడు పోస్ట్
ఎర్రుపాలెం మండలం
ఖమ్మం జిల్లా .
దూరవాణి సంఖ్య . 9553412603.
దయచేసి ఎవరి వద్దనైన ఉంటే పంపగలరని ఆశిస్తూ ...
తమ విదేయుడు
చిరునామా : టి. వి. వి. సత్యనారాయణ చారీ
తక్కెళ్ళపాడు పోస్ట్
ఎర్రుపాలెం మండలం
ఖమ్మం జిల్లా .
దూరవాణి సంఖ్య . 9553412603.
దయచేసి ఎవరి వద్దనైన ఉంటే పంపగలరని ఆశిస్తూ ...
తమ విదేయుడు
Saturday, 5 October 2013
"Why We Shout In Anger" ఈ చక్కని విషయాన్ని సమయాభావం వలన అనువదించలేకపోయాను.
- "Why We Shout In Anger" A Hindu saint who was visiting river Ganges to take bath found a group of family members on the banks, shouting in anger at each other. He turned to his disciples smiled'n asked. 'Why do people shout in anger shout at each other?' Disciples thought for a while, one of them said,'Because we lose our calm, we shout.' 'But, why should you shout when the other person is just next to you? You can as well tell him what you have to say in a soft manner.'asked the saint Disciples gave some other answers but none satisfied the other disciples. Finally the saint explained, . 'When two people are angry at each other, their hearts distance a lot. To cover that distance they must shout to be able to hear each other. The angrier they are, the stronger they will have to shout to hear each other to cover that great distance. What happens when two people fall in love? They don't shout at each other but talk softly, Because their hearts are very close. The distance between them is either nonexistent or very small...' The saint continued,'When they love each other even more, what happens? They do not speak, only whisper'n they get even closer to each other in their love. Finally they even need not whisper, they only look at each other'n that's all. That is how close two people are when they love each other.' He looked at his disciples and said. 'So when you argue do not let your hearts get distant, Do not say words that distance each other more, Or else there will come a day when the distance is so great that you will not find the path to return.'
- ఈ చక్కని విషయాన్ని సమయాభావం వలన అనువదించలేకపోయాను. ఎవరైనా అనువదించి టపా పెడితే సంతొషించగలవాడను.
Tuesday, 24 September 2013
Tuesday, 17 September 2013
ఏది ధర్మం ?
ధారణాత్ ధర్మ ఇత్యాహు: ధర్మోధారయతే ప్రజా:
ప్రజలందరినీ సక్రమ మార్గంలో నడిపించేది ధర్మం. ఇలా ధర్మ మార్గాన్ని అనుసరించే సమాజం భ్రష్టుపట్టకుండా , ఇతర సమాజాల లేదా ఇతరదేశాల మన్ననలను పొందుతుంది.ధర్మాధర్మాలకు సత్యాసత్యాలకు మధ్య ఉండే తేడా అత్యంత సూక్ష్మం గా ఉంటుంది. దీనిని నిర్ధారించటం ఎంతో మేధావులైన ధర్మవేత్తలకు తప్ప సాధ్యం కాదు. ఇలా నిర్వచించడానికే ఇంతక్లిష్టంగా ఉంటే ఆచరించడం ఇంకెంత కష్టమో ఆలోచించండి. శ్రీ రాముని " రామో విగ్రహవాన్ ధర్మః " అని వాల్మీకి మహర్షి వినుతించినప్పటికి అంతటి అవతార ముర్తినే తనను అన్యాయం గా చంపావని వాలి రాముని నిందించాడు కదా ! అందుకే ధర్మ నిర్వచనం అంత తేలికైన విషయం కాదు. మహాభారతంలో వేదవ్యాస మహర్షి ధర్మాన్ని ఇలా చెప్పారు.
ఒరులేయవి ఒనరించిన నరవర తన మనంబునకగు నవిదా । నొరులకు సేయకునికి పరాయణము పరమ ధర్మముల కెల్లన్ ॥
నీవు ఇతరులు వలన దేనివలన బాధింపబడ్డావో అది తిరిగి ఇతరులెవ్వరికీ నీవు చేయకుండా ఉండటమే ధర్మం అంటే . ఇంతకన్నా సులువైన విధంగా ధర్మాన్ని నిర్వచించడం సాధ్యం కాదేమో కదా!
మరి ధర్మానికి హాని కలిగితే !?
మరి ధర్మానికి హాని కలిగితే ఏమవుతుందో తరువాతి టపా లో తెలుసుకుందాం.
శ్రీ సాయినాథాయ నమో వాసుదేవాయ .
Sunday, 15 September 2013
పగలు,రాత్రి ఏర్పడే విధానాన్ని వేదకాలంలోనే స్పష్టంగా చెప్పిన మన పూర్వీకులు
ఋగ్వేదం లోని శాకల శాఖకు చెందిన బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో క్రింది శ్లోకాన్ని చూడండి.
"స వా ఏష న కదాచనాస్తమేతి నోదేతి, తం యచస్తమేతీతి మన్యంతేహ్న ఏవ తదంత్వమిత్వాథాత్మానం విపర్యస్యతే- రాత్రీమేవావస్తాత్ కురుతేహః పరస్తాత్ ... య ఏవం వేద" 14.6
పూర్తి టపా కొరకు క్రింది లంకె మీద నొక్కండి .
http://sureshkadiri.blogspot.in/2010/07/blog-post_4400.html#comment-form

Saturday, 14 September 2013
అవివేకానికి దూరంగా ఉండి యదార్థానికి దగ్గరవగలిగినందు వలననే స్థితప్రజ్ఞులవగలరని మనకు అర్థమగును
జరాం మృత్యుం భయం వ్యాధిం యో జానాతి స పండిత:
స్వస్థ స్తిష్ఠే న్నిషేదే ద్వా స్వపేద్వా కేనచి ద్ధసేత్.
భావము:-
అపాయములు, వ్యాధులు, ముసలితనము, చావు, ఇవి ఎవ్వరికిన్నీ తప్పవు. కాని ఇవి తప్పవని ఎవ్వరును గుర్తించినట్లు ప్రవర్తించరు. వీటి అవశ్యంభావిత్వమును గుర్తించి ప్రవర్తించేవాడు పండితుడు. అట్టివానికి మనస్సు ఎప్పుడూ స్వస్థముగానే ఉంటుంది. అతడు సుఖంగా కూర్చుంటాడు. నిద్రిస్తాడు. పరిహాసంగా మాటలడుతాడు
అవివేకానికి దూరంగా ఉండి యదార్థానికి దగ్గరవగలిగినందు వలననే స్థితప్రజ్ఞులవగలరని మనకు అర్థమగును
చింతా రామ కృష్ణా రావు గారి ఆంద్రామృతం నుండి స్వీకారము .
http://andhraamrutham.blogspot.in/2010/01/76.html#.UjRnKdJHKi4

Thursday, 12 September 2013
ఇది ప్రతి రోజు మననం చేయడం ద్వారా మనలో విజ్ఞత తప్పకుండ పెరుగుతుంది.
శ్లోకః :-ప్రత్యహం ప్రత్యవేక్షేత, నరశ్చరిత మాత్మనః.
కిం ను మే పశుభిస్తుల్యం? కిం ను సత్ పురుషైరివ?----మహాభారతం.--అరణ్య పర్వం---29 వ శ్లోకం.
గీ:-
పశువు వోలె ప్రవర్తించు పాపినా! సు
జనుని వలె నడచు కొను సుజనుడినా! య
ని యను దినము ప్రశ్నంచుకొని.మన నగును.
మానవాళికి తగునిది. మహితులార.

నేను చదివిన ఒక అందమైన కవిత .
నీవు తాకి వెళ్ళిన నాటి నుండి
మువ్వలు మూగబోయి సడిచేయడం మానేసాయి
మౌనంగానే వింతశబ్దాలు చేయాలని
విశ్వప్రయత్నం చేసి అలిసిపోఅయాయి.
నీ తలపులతోనే కొత్తమెరుపులు
సంతరించుకున్నాయి.
తలపై తలంబ్రాల తారకలు
తారాడే క్షణం కోసం తల్లడిల్లుతున్నాయి.
మోహం పెరిగి ముత్యాలపందిరిలో
నీకై నిరీక్షణలు చేస్తున్నాయి.
నీవు అలదే పారిజాతాల పారాణికై
పరుగులు తీస్తున్నాయి.
కాలిమెట్టెలు తొడిగి కొంటెకోరికలకి
కళ్ళెమెప్పుడు విప్పుతావని అల్లరిపెడుతున్నాయి.
కళ్యాణ గంటలెప్పుడు మోగిస్తావని
నా గుండె గుసగుసలకు తోడెప్పుడొస్తావని
తొందరపడుడుతున్నాయి.
నీ వలపుల వెలుగుతో నా మేనికి
వన్నెప్పుడు అద్దుతావని ప్రశ్నిస్తున్నాయి.

------శ్రీస్వర్ణ
Friday, 6 September 2013
Thursday, 5 September 2013
Tuesday, 13 August 2013
Friday, 26 April 2013
సంప్రదాయం సంక నాకించి , పరాయి సంస్కృతి లో పయనించే
పిచ్చికుంకల రాజ్యంలో నేను ఇమడలేకపోతున్నాను.
మొదటిసారి వ్రాసాను. సలహాలు , సూచనలు , విమర్శలు ఆహ్వానిస్తున్నాను .
ధన్యవాదాలతో...
మీ ..
-----సతీష్ తాటికొండ ----
పిచ్చికుంకల రాజ్యంలో నేను ఇమడలేకపోతున్నాను.
సరిపోయే సహనాన్ని ప్రసాదించమని భగవంతుడిని వేడుకొంటున్నాను.
పరమత సహనమే పనికిరాని సమాజంలో ,
అనురాగం , ఆప్యాయత లు ఆవిరైన చోట దుర్భిణిలో సైతం జాడ దొరకని ప్రేమ .
విస్తు పోయే వస్తు ప్రపంచం లో పస్తులుండే పతితులెందరో ??
మగాడు మృగాడైన చోట మానవత్వం మసిమచ్చై మిగిలింది.
ఓ ప్రభుత్వమా భ్రూణ హత్యలకు అనుమతులివ్వండి .
కని , పెంచి , కనికరమైనా లేని కర్కశుల చేతుల్లో ఛిద్రం కాకుండా !
కాపాడలేని చోట పుట్టుకనే బహిష్కరించుదాం .
చట్టాలు ఎన్ని చేశామన్నది కాదు దాని చుట్టాలెంత మందో చూడండి.
మా భవిష్యత్తులు బంగారం చేయక్కరలేదు.
ఉన్న సింగారం చెడకుంటే చాలు.
డంబాచారాలు మాని మానవులై జీవిద్దాం .
"కదిలిస్తే" కదలండి , కాపాడుకుందాం ప్రపంచాన్ని.
మొదటిసారి వ్రాసాను. సలహాలు , సూచనలు , విమర్శలు ఆహ్వానిస్తున్నాను .
ధన్యవాదాలతో...
మీ ..
-----సతీష్ తాటికొండ ----
Wednesday, 24 April 2013
ప్రతీ మనిషీ మూడు ఋణాలతో పుడతాడు.
1. ఋషిఋణం, 2. దేవఋణం, 3. పితౄణం.
ఈ ఋణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి. ఈ ఋణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తంది. మానవజన్మకు సార్థకత జన్మరాహిత్యం. కావున ప్రతివాడు ఋణ విముక్తుడు కావాలి. దానికి ఏంటి మార్గం? మన పెద్దలు చెప్పారు – “బ్రహ్మచర్యేణ ఋషిభ్యః” ” యజ్ఞేన దేవేభ్యః” “ప్రజయా పితృభ్యః” అని.
1. ఋషి ఋణం: బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి. అంటే బ్రహ్మచర్యంలో చేయవలసిన వేదాధ్యయనం చేయాలి. అలాగే పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి.
2. దేవఋణం: యజ్ఞ యాగాది క్రతువులు చేయడం, చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞం అంటే త్యాగం. యజ్ఞాలవల్ల దేవతలు తృప్తి చెందుతారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పాడిపంటలు వృద్ధి చెందుతాయి. కరువు కాటకాలు తొలగిపోతాయి. నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికి మనమెంతో ఋణపడివున్నాం. కనుక ఆ ఋణాన్ని తీర్చకపోతే మనం కృతఘ్నలం అవుతాం.
3. పితౄణం: సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు. వంశాన్ని అవిచ్చిన్నంగా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితౄణం తీర్చుకోవాలి. సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి గదా! “ప్రజాతంతుం మావ్యవత్సేత్సీః” అంటుంది వేదం. అంటే వంశపరంపరను త్రెంచవద్దు. వేదాధ్యయనం, యజ్ఞం చేయడం, సంతానము కనడం ఇవి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెపుతున్నది. యజ్ఞాలలో పంచ యజ్ఞాలు విధిగా ప్రతి మనిషీ చేయాలి. అవి దేవ, మనుష్య, భూత, పితృ, బ్రహ్మ యజ్ఞాలు.

Subscribe to:
Posts (Atom)