Tuesday 17 September 2013

ఏది ధర్మం ?

ధారణాత్ ధర్మ ఇత్యాహు: ధర్మోధారయతే ప్రజా: 

ప్రజలందరినీ సక్రమ మార్గంలో నడిపించేది ధర్మం. ఇలా ధర్మ మార్గాన్ని అనుసరించే సమాజం భ్రష్టుపట్టకుండా , ఇతర సమాజాల లేదా ఇతరదేశాల మన్ననలను పొందుతుంది.  

ధర్మాధర్మాలకు సత్యాసత్యాలకు మధ్య ఉండే తేడా అత్యంత సూక్ష్మం గా ఉంటుంది. దీనిని నిర్ధారించటం ఎంతో మేధావులైన ధర్మవేత్తలకు తప్ప సాధ్యం కాదు. ఇలా నిర్వచించడానికే ఇంతక్లిష్టంగా ఉంటే ఆచరించడం ఇంకెంత కష్టమో ఆలోచించండి. శ్రీ రాముని " రామో విగ్రహవాన్ ధర్మః " అని వాల్మీకి మహర్షి వినుతించినప్పటికి అంతటి అవతార ముర్తినే తనను అన్యాయం గా చంపావని వాలి రాముని నిందించాడు కదా ! అందుకే ధర్మ నిర్వచనం అంత తేలికైన విషయం కాదు. మహాభారతంలో వేదవ్యాస మహర్షి ధర్మాన్ని ఇలా చెప్పారు. 


ఒరులేయవి ఒనరించిన నరవర తన మనంబునకగు నవిదా । నొరులకు సేయకునికి పరాయణము పరమ ధర్మముల కెల్లన్ ॥ 



నీవు ఇతరులు వలన దేనివలన బాధింపబడ్డావో అది తిరిగి ఇతరులెవ్వరికీ నీవు చేయకుండా ఉండటమే ధర్మం అంటే . ఇంతకన్నా సులువైన విధంగా ధర్మాన్ని నిర్వచించడం సాధ్యం కాదేమో కదా! 


మరి ధర్మానికి హాని కలిగితే !?



మరి ధర్మానికి హాని కలిగితే ఏమవుతుందో తరువాతి టపా లో తెలుసుకుందాం. 
శ్రీ సాయినాథాయ నమో వాసుదేవాయ . 


Sunday 15 September 2013

పగలు,రాత్రి ఏర్పడే విధానాన్ని వేదకాలంలోనే స్పష్టంగా చెప్పిన మన పూర్వీకులు

ఋగ్వేదం లోని శాకల శాఖకు చెందిన బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో క్రింది శ్లోకాన్ని చూడండి.

" వా ఏష న కదాచనాస్తమేతి నోదేతి, తం యచస్తమేతీతి మన్యంతేహ్న ఏవ తదంత్వమిత్వాథాత్మానం విపర్యస్యతే- రాత్రీమేవావస్తాత్ కురుతేహః పరస్తాత్ ... య ఏవం వేద" 14.6

పూర్తి టపా కొరకు క్రింది లంకె మీద నొక్కండి .

http://sureshkadiri.blogspot.in/2010/07/blog-post_4400.html#comment-form

Saturday 14 September 2013

అవివేకానికి దూరంగా ఉండి యదార్థానికి దగ్గరవగలిగినందు వలననే స్థితప్రజ్ఞులవగలరని మనకు అర్థమగును

జరాం మృత్యుం భయం వ్యాధిం యో జానాతి స పండిత:
స్వస్థ స్తిష్ఠే న్నిషేదే ద్వా స్వపేద్వా కేనచి ద్ధసేత్.

భావము:-
అపాయములు, వ్యాధులు, ముసలితనము, చావు, ఇవి ఎవ్వరికిన్నీ తప్పవు. కాని ఇవి తప్పవని ఎవ్వరును గుర్తించినట్లు ప్రవర్తించరు. వీటి అవశ్యంభావిత్వమును గుర్తించి ప్రవర్తించేవాడు పండితుడు. అట్టివానికి మనస్సు ఎప్పుడూ స్వస్థముగానే ఉంటుంది. అతడు సుఖంగా కూర్చుంటాడు. నిద్రిస్తాడు. పరిహాసంగా మాటలడుతాడు


అవివేకానికి దూరంగా ఉండి యదార్థానికి దగ్గరవగలిగినందు వలననే స్థితప్రజ్ఞులవగలరని మనకు అర్థమగును

 చింతా రామ కృష్ణా రావు గారి ఆంద్రామృతం నుండి స్వీకారము .
http://andhraamrutham.blogspot.in/2010/01/76.html#.UjRnKdJHKi4

Thursday 12 September 2013

ఇది ప్రతి రోజు మననం చేయడం ద్వారా మనలో విజ్ఞత తప్పకుండ పెరుగుతుంది.

శ్లోకః :-ప్రత్యహం ప్రత్యవేక్షేత, నరశ్చరిత మాత్మనః.
కిం ను మే పశుభిస్తుల్యం? కిం ను సత్ పురుషైరివ?----మహాభారతం.--అరణ్య పర్వం---29 వ శ్లోకం.


గీ:- 
పశువు వోలె ప్రవర్తించు పాపినా! సు
జనుని వలె నడచు కొను సుజనుడినా! య
ని యను దినము ప్రశ్నంచుకొని.మన నగును.
మానవాళికి తగునిది. మహితులార.

నేను చదివిన ఒక అందమైన కవిత .


నీవు తాకి వెళ్ళిన నాటి నుండి
మువ్వలు మూగబోయి సడిచేయడం మానేసాయి
మౌనంగానే వింతశబ్దాలు చేయాలని 
విశ్వప్రయత్నం చేసి అలిసిపోఅయాయి.

నీ తలపులతోనే కొత్తమెరుపులు
సంతరించుకున్నాయి.
తలపై తలంబ్రాల తారకలు
తారాడే క్షణం కోసం తల్లడిల్లుతున్నాయి.

మోహం పెరిగి ముత్యాలపందిరిలో
నీకై నిరీక్షణలు చేస్తున్నాయి.
నీవు అలదే పారిజాతాల పారాణికై
పరుగులు తీస్తున్నాయి.
కాలిమెట్టెలు తొడిగి కొంటెకోరికలకి
కళ్ళెమెప్పుడు విప్పుతావని అల్లరిపెడుతున్నాయి.

కళ్యాణ గంటలెప్పుడు మోగిస్తావని
నా గుండె గుసగుసలకు తోడెప్పుడొస్తావని
తొందరపడుడుతున్నాయి.
నీ వలపుల వెలుగుతో నా మేనికి
వన్నెప్పుడు అద్దుతావని ప్రశ్నిస్తున్నాయి.
                                             ------శ్రీస్వర్ణ

Thursday 5 September 2013

అమ్మ


రేపటికి అంటే 7-9-2013 కి అమ్మ మరణించి సంవత్సరం .