ధారణాత్ ధర్మ ఇత్యాహు: ధర్మోధారయతే ప్రజా:
ప్రజలందరినీ సక్రమ మార్గంలో నడిపించేది ధర్మం. ఇలా ధర్మ మార్గాన్ని అనుసరించే సమాజం భ్రష్టుపట్టకుండా , ఇతర సమాజాల లేదా ఇతరదేశాల మన్ననలను పొందుతుంది.ధర్మాధర్మాలకు సత్యాసత్యాలకు మధ్య ఉండే తేడా అత్యంత సూక్ష్మం గా ఉంటుంది. దీనిని నిర్ధారించటం ఎంతో మేధావులైన ధర్మవేత్తలకు తప్ప సాధ్యం కాదు. ఇలా నిర్వచించడానికే ఇంతక్లిష్టంగా ఉంటే ఆచరించడం ఇంకెంత కష్టమో ఆలోచించండి. శ్రీ రాముని " రామో విగ్రహవాన్ ధర్మః " అని వాల్మీకి మహర్షి వినుతించినప్పటికి అంతటి అవతార ముర్తినే తనను అన్యాయం గా చంపావని వాలి రాముని నిందించాడు కదా ! అందుకే ధర్మ నిర్వచనం అంత తేలికైన విషయం కాదు. మహాభారతంలో వేదవ్యాస మహర్షి ధర్మాన్ని ఇలా చెప్పారు.
ఒరులేయవి ఒనరించిన నరవర తన మనంబునకగు నవిదా । నొరులకు సేయకునికి పరాయణము పరమ ధర్మముల కెల్లన్ ॥
నీవు ఇతరులు వలన దేనివలన బాధింపబడ్డావో అది తిరిగి ఇతరులెవ్వరికీ నీవు చేయకుండా ఉండటమే ధర్మం అంటే . ఇంతకన్నా సులువైన విధంగా ధర్మాన్ని నిర్వచించడం సాధ్యం కాదేమో కదా!
మరి ధర్మానికి హాని కలిగితే !?
మరి ధర్మానికి హాని కలిగితే ఏమవుతుందో తరువాతి టపా లో తెలుసుకుందాం.
శ్రీ సాయినాథాయ నమో వాసుదేవాయ .
No comments:
Post a Comment