Monday, 21 October 2013

18 మహాపురాణాల్లో స్కాందపురాణం ఒకటి. ఈ పురాణాన్ని సాక్షాత్తూ ఆ కైలాసవాసుడైన మహేశ్వరుడు స్కందునికి ఉపదేశించాడు.


స్కాందపురాణం:
మహాపురాణాల్లో స్కాందపురాణం ఒకటి. ఈ పురాణాన్ని సాక్షాత్తూ ఆ కైలాసవాసుడైన మహేశ్వరుడు స్కందునికి ఉపదేశించాడు. ఇందులో ఏడు ఖండాలున్నాయి. రెండవదైన వైష్ణవఖండంలో శ్రీ వేంకటాచల మాహాత్మ్యం నలభై అధ్యాయాల్లో వర్ణితమైంది.
భగవంతుని శ్వేతవరాహావతార వర్ణనం, వరాహస్వామి మహామహి మత్వం, వైభవ విశేషాలు దీనిలో ప్రతిపాదితమయ్యాయి. మొదటి పది అధ్యాయాలు ధరణి వరాహ సంవాదరూపంలో ఉన్నాయి. ఇందులో వరాహమంత్రారాధన, దాని ఫలితం పేర్కొన్నారు. ఇంకా శ్రీ వేంకటాచల క్షేత్ర వర్ణన, చతుర్ముఖుడైన బ్రహ్మ ప్రారంభించిన బ్రహ్మోత్సవ విశేషాలు, వేంకటేశ్వర వైభవం, శ్రీ వేంకటేశ్వరుని యందు అష్టవిధ భక్తి విధానాలు, భగవంతుడు భూత సృష్టి చెయ్యడం, భరధ్వాజ మహర్షి వర్ణించిన వేంకటాచల మాహాత్మ్య విషయాలు, అంజనాదేవి పుత్రునికోసం తపస్సు చెయ్యడం, వ్యాస మహర్షి చెప్పిన ఆకాశ గంగా స్నాన కాలనిర్ణయం, వేంకటాచలంలో చెయ్యదగ్గ దాన విశేషాలు ఇత్యాదివి వర్ణితమయ్యాయి.
శ్రీ పద్మావతీ శ్రీనివాస కల్యాణ వర్ణన సందర్భంలో భూమినుండి పద్మావతి లభించడం, నారద మహర్షి పద్మావతికి సాముద్రికం చెప్పడం, శ్రీనివాసుడు వేటకోసం పుష్పోద్యానానికి రావడం, పద్మావతిని చూసి మోహాన్ని పొందడం, ఆకాశరాజు నగరానికి వకుళమాలిక రావడం, ఆమెకు పద్మావతీ సఖులు పద్మావతీ వృత్తాంతం చెప్పడం వర్ణితమయ్యాయి.
అలాగే, పద్మావతి భగవంతుని, భగవద్భక్తుల లక్షణాల్ని చెప్పడం, వకుళమాలికి మాట మేరకు ధరణీదేవి ఆకాశరాజులు పద్మావతీ శ్రీనివా సుల కల్యాణాన్ని నిశ్చయించడం, ఈ విషయాన్ని శుకమహర్షి ద్వారా శ్రీనివాసునికి తెలియచెప్పడం, మహాలక్ష్మి తదితరులు శ్రీనివాసునికి వివాహాలంకారం చెయ్యడం, శ్రీనివాసుడు బ్రహ్మాదులతో నారాయణ వనా నికి రావడం, పద్మావతీ శ్రీనివాసుల పరిణయం, శ్రీనివాసుడు ఆకాశరాజు నకు భక్తప్రాప్తిరూపమైన వరం అనుగ్రహించడం మొదలై నవి వర్ణితమయ్యాయి.

No comments:

Post a Comment