Wednesday 23 October 2013

ధర్మానికి హాని కలిగితే !!!???

ధర్మానికి హాని కలిగితే ఏమవుతుంది ???

ధర్మ , రాజ , వహ్ని , తస్కరుల్ నలుగురు
భ్రాతలర్ధమునకు బ్రాలి వారలందు । 
నగ్రజాతునవమాన మొనరింప 
గినుక వొడము మువ్వురనుజులకును ॥ 

ధర్మం , అగ్ని , రాజు , దొంగ ఈ నలుగురూ అన్నదమ్ములంటుంది ధర్మఖండం. పెద్దవాడైన 'ధర్ముడి' కి అన్యాయం జరిగితే అయన తమ్ములైన అగ్ని , రాజు , దొంగ ముగ్గురూ కోపగిస్తారట.

చత్వారో ధనదాయాదా ధర్మాన్ని నృపతస్కరాః । 
జ్యేష్ఠ ( భ్రాతా ) వమానేన త్రయః కుర్యంతి సోదరాః ॥ 

ధర్ముడు , అగ్ని , రాజు , తస్కరుడు ( దొంగ ), నలుగురన్నదమ్ముల్లో పెద్దవాడికన్యాయం జరిగితే 
అగ్ని కొంపలు, సంపదలు కాల్చేస్తాడు. రాజు పన్నులు విధించి వేధిస్తాడు. దొంగ దొంగిలిస్తాడు అని అర్ధం.

No comments:

Post a Comment